sharwanand: శర్వానంద్ కి బ్రదర్ గా మరో హీరో దొరికేశాడు!

  • గీతా ఆర్ట్స్ బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాల 
  • అన్నదమ్ముల అనుబంధమే నేపథ్యం 
  • సెట్స్ పైకి వెళ్లే దిశగా సన్నాహాలు   

ఒక సినిమా హిట్ అయితే  సహజంగానే ఆ దర్శకుడిని వెతుక్కుంటూ వరుస అవకాశాలు వస్తాయి. ఒక ప్లాప్ వచ్చిందంటే మాత్రం ఆ దర్శకుడు మరో అవకాశం కోసం మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి బయటపడటానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నిస్తున్నాడు.

 'బ్రహ్మోత్సవం' భారీ పరాజయం తరువాత ఆయన మరో కథను పట్టాలెక్కించడానికి చాలా సమయం తీసుకోవలసి వచ్చింది. ఇటీవల ఆయన ఒక కథను వినిపించి శర్వానంద్ నుంచి ఓకే అనిపించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇది అన్నదమ్ముల అనుబంధానికి సంబంధించిన కథ కావడంతో, తమ్ముడిగా మరో హీరోను ఒప్పించారు .. ఆయనే శ్రీ విష్ణు. ఆయన ఖాతాలో 'నీదీ నాదీ ఒకే కథ' అనే రీసెంట్ హిట్ వుంది. గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.  

sharwanand
sri vishnu
  • Loading...

More Telugu News