Congress: బలపరీక్షలో మేమే గెలుస్తాం.. బీజేపీకి పరాభవం తప్పదు: కాంగ్రెస్

  • ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేలా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది
  • బీజేపీకి సుప్రీం తీర్పు చెంపపెట్టులాంటిది
  • కాంగ్రెస్, జేడీఎస్ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. రేపు సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని స్పష్టమైన ఆదేశాలను వెలువరించింది. సుప్రీం తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేలా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని కాంగ్రెస్ నేత అశ్వని కుమార్ తెలిపారు.

 న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిలబెట్టుకుందని చెప్పారు. అనైతిక విధానాలతో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టులాంటిదని అన్నారు. రేపు జరగబోయే బలపరీక్షలో యడ్యూరప్పకు, బీజేపీకి పరాభవం తప్పదని చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ కూటమి బలపరీక్షలో గెలుపొంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. 

Congress
BJP
karnataka
floor test
Supreme Court
aswani kumar
assembly
  • Loading...

More Telugu News