raja simha: నేను ఆత్మహత్యాయత్నం చేయలేదు: సినీ డైరెక్టర్ రాజసింహ

  • ఆత్మహత్యాయత్నం చేశాడనే వార్తలపై రాజసింహ స్పందన
  • నాకు మధుమేహం ఉంది.. షుగర్ లెవెల్స్ ఎక్కువై అపస్మారక స్థితిలోకి వెళ్లా
  • రెండు, మూడు రోజుల్లో హైదరాబాదుకు వస్తా

సినీ రచయిత రాజసింహ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాజసింహ స్పందించాడు. జరిగింది ఒకటైతే, మీడియాలో మరొకటి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు మధుమేహం ఉందని... ముంబైలో ఉండగా ఒక్కసారిగా తనకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయని, దీంతో స్పృహ తప్పి పడిపోయానని చెప్పాడు.

తనను ఎవరో ఆసుపత్రికి తీసుకెళ్లారని, ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపాడు. తన ఆరోగ్యం గురించి కంగారుపడ్డ వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. మరో రెండు, మూడు రోజుల్లో హైదరాబాదుకు వస్తానని చెప్పాడు. 'ఒక్క అమ్మాయి తప్ప' అనే సినిమాకు రాజసింహ దర్శకత్వం కూడా వహించాడు. ఆ సినిమా పరాజయంపాలవడంతో, ఆ తర్వాత ఆయనకు అవకాశాలు రాలేదు. దీంతో, డిప్రెషన్ కు లోనై, ఆత్మహత్యాయత్నం చేశాడనే వార్తలు వచ్చాయి. 

raja simha
director
suicide
  • Loading...

More Telugu News