Mahesh Babu: భారీస్థాయిలో మలయాళంలోకి 'భరత్ అనే నేను'

- తెలుగులో 'భరత్'కి ఘన విజయం
- తమిళంలో ఈ నెల 25న రిలీజ్
- మలయాళంలోను అదే రోజున
మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' తెలుగు రాష్ట్రాల్లో విజయవిహారం చేసింది. ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి నీరాజనాలు పట్టారు. తమిళనాట తెలుగు వెర్షన్ కే ఒక రేంజ్ లో ఆదరణ లభిస్తూ ఉండటంతో, తమిళంలోకి ఈ సినిమాను అనువదించి,ఈ నెల 25వ తేదీన అక్కడ విడుదల చేయనున్నారు. ఈ కారణంగా అక్కడ ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువకానుంది.
