Bhopal: భోపాల్‌లో మరో ‘నిర్భయ’ ఘటన.. మహిళపై అత్యాచారం, హత్య.. పోస్టుమార్టంలో నివ్వెర పరిచే విషయాలు వెల్లడి!

  • సంచలనం రేపుతున్న భోపాల్ రేప్ ఘటన
  • రెండు రోజుల క్రితం ఇంట్లోనే అత్యాచారం, హత్య
  • అదృశ్యమైన వ్యక్తి కోసం గాలింపు

దేశంలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. తాజాగా భోపాల్‌లో అత్యంత అమానవీయమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల మహిళపై అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆపై హత్య చేశారు. పోస్టుమార్టం సందర్భంగా ఆమె రహస్య భాగాల నుంచి బీరు, కూల్ డ్రింక్ బాటిళ్లను వైద్యులు వెలికి తీయడం సంచలనం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెహోర్ జిల్లాలోని ఇచ్చావర్ పట్టణానికి చెందిన మహిళ మరో వ్యక్తితో కలిసి ప్రగతి నగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె నివసిస్తున్న గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులకు నగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహం కనిపించింది.

రెండు రోజుల క్రితం దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. పోస్టుమార్టం సందర్భంగా ఆమె రహస్య భాగాల నుంచి బీరు, సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లను వైద్యులు వెలికి తీసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, హత్య తర్వాత ఆమె భర్తగా చెబుతున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, అదృశ్యమైన వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News