Karnataka: శివకుమార స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న సీఎం యడ్యూరప్ప

  • సిద్దగంగ మఠాన్ని సందర్శించిన సీఎం
  • ఆశీర్వదించిన శివకుమార్ స్వామీజీ
  • స్వామీజీకి శాలువా కప్పి సత్కరించిన యెడ్డీ

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తుముకూరు శివారులోని సిద్దగంగ మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మఠాధిపతి, శతాయషీ డాక్టర్ శివకుమార్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. మఠానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామీజీ ఆశీర్వాదాల కోసమే సీఎం మఠానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. స్వామీజీతో మాట్లాడిన యడ్యూరప్ప ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట పలువురు నేతలు, అధికారులు ఉన్నారు.

Karnataka
Yeddyurapp
CM
Shiva Kumara Swami
  • Loading...

More Telugu News