ntr: ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన ఫ్యాన్స్ కి గిఫ్ట్

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • సంగీత దర్శకుడిగా తమన్

ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ నెల 20వ తేదీన. ఆ రోజు కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేయడమో .. ఫస్టులుక్ ను వదలడమో జరగవచ్చని అభిమానులు భావించారు.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పీఆర్వో ఒక ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ పుట్టినరోజున త్రివిక్రమ్ సినిమా నుంచి ఒక కానుక సిద్ధమవుతోందనీ, ఈ కానుక ఆయన అభిమానులను ఎంతమాత్రం నిరాశపరచదని చెప్పాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి 'అసామాన్యుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ స్వరాలను సమకూర్చుతున్నాడు. 

  • Loading...

More Telugu News