Andhra Pradesh: ఏపీలో విధ్వంసం సృష్టించడానికి జగన్‌ సిద్ధమయ్యారు: కంభంపాటి రామ్మోహన్ రావు

  • అరాచరక శక్తులతో పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి 
  • రమణదీక్షితులు మాట్లాడడం వెనుక అనుమానాలు
  • ఆయన వెనుక బీజేపీ, వైసీపీ ఉంది
  • దేవస్థాన పవిత్రతకు భంగం కలుగుతుంది

ప్రకృతి వైపరీత్యాలను కూడా ప్రభుత్వ కుట్ర అనే సంస్కృతి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌దని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి సమయం ఉండదు కానీ, రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అరాచక శక్తులతో పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై జగన్‌ దాడి చేయించారని, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని కంభంపాటి రామ్మోహన్‌రావు ఆరోపించారు.

కాగా, తమ పార్టీపై రమణదీక్షితులు మాట్లాడడం చాలా అనుమానాలను కలిగిస్తోందని, ఆయన వెనుక బీజేపీ, వైసీపీ ఉన్నాయనే అనుమానం కలుగుతోందని కంభంపాటి రామ్మోహన్‌ అన్నారు. రమణదీక్షితులుకి ఏమైనా అజెండా ఉంటే ఏదో ఒక పార్టీలో చేరి మాట్లాడాలని, అంతేగానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. ప్రధాన అర్చకుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేవస్థాన పవిత్రతకు భంగం కలుగుతుందని మండిపడ్డారు.

Andhra Pradesh
Jagan
YSRCP
Kambhampati Rammohan Rao
  • Loading...

More Telugu News