Narendra Modi: ప్రధానిగా తొలిరోజు పార్లమెంటుకు వెళ్లిన మోదీని గుర్తుకు తెచ్చిన యడ్యూరప్ప

  • విధానసభ మెట్లను తాకి, నమస్కరించిన యడ్యూరప్ప
  • 2014లో పార్లమెంటు మెట్లకు తలను ఆనించి, నమస్కరించిన మోదీ
  • ప్రజాస్వామ్యానికి దేవాలయాలుగా అభివర్ణించిన ఇరువురు నేతలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈ ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఆ కార్యక్రమం తర్వాత ఆయన రాజ్ భవన్ నుంచి విధానసభకు వెళ్లారు. ఈ సందర్భంగా విధానసభలోకి అడుగు పెట్టే ముందు కిందకు వంగి సభ మెట్లను తాకి, నమస్కరించారు. అసెంబ్లీని ప్రజాస్వామ్యానికి దేవాలయంగా ఆయన అభివర్ణించారు.
ఈరోజు యడ్యూరప్ప ప్రవర్తించిన తీరు... 2014 మేలో పార్లమెంటు వద్ద నరేంద్ర మోదీ ప్రవర్తించిన తీరును గుర్తుకు తెచ్చింది. ప్రధాని హోదాలో తొలిసారి పార్లమెంటుకు వెళ్లిన ఆయన... పార్లమెంటు భవనం మెట్లకు తలను ఆనించి, నమస్కరించారు. అప్పుడు ఆయన పార్లమెంటును ప్రజాస్వామ్యానికి దేవాలయంగా అభివర్ణించారు.

Narendra Modi
yeddyurappa
  • Loading...

More Telugu News