kalyan: చిరూ చిన్నల్లుడు డబ్బింగ్ మొదలెట్టేశాడు

- తెరపైకి హీరోగా చిరూ చిన్నల్లుడు
- రాకేశ్ శశి దర్శకత్వంలో మూవీ
- కథానాయికగా మాళవిక నాయర్
చిరూ చిన్నల్లుడు కల్యాణ్ ను చూడగానే .. చరణ్ కి దగ్గరి పోలికలు ఉన్నాయని చాలామంది అనుకున్నారు. ఇతగాడు కూడా హీరో కావడం ఖాయమని చెప్పుకున్నారు. అక్షరాలా ఇప్పుడు అదే జరిగింది. సినిమాల్లోకి రావాలనే ఆసక్తితో కల్యాణ్ .. నటనలో శిక్షణ తీసుకున్నాడు. గట్టి కసరత్తులు చేస్తూ మరింత ఫిట్ నెస్ పెంచుకున్నాడు.
