gujarath employee: 19 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను సంపాదించిన గుజరాతీ బాబు
- 1995 నుంచి కొనసాగుతున్న అధ్యయనం
- ఓపికున్నంత కాలం డిగ్రీ కోర్సులు చేస్తానంటున్న అనిల్ యాదవ్
- ఈయన గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగి
ఒక పీజీ డిగ్రీ చేయడానికే నానా తిప్పలు పడే వారుంటే... గుజరాత్ కు చెందిన 50 ఏళ్ల అనిల్ యాదవ్ మాత్రం ఏకంగా 19 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను సంపాదించి రికార్డు సృష్టించారు. ఈయన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా. 1995 నుంచి అనిల్ యాదవ్ డిగ్రీల వేట కొనసాగుతూనే ఉంది. ‘‘నేను చేయగలిగినంత కాలం దీన్ని కొనసాగిస్తా. ఈ పరీక్షల కోసం నేను దేశవ్యాప్తంగా ప్రయాణించా. అసోంలోని గువహటి నుంచి గుజరాత్ లోని బర్దోలిన్ వరకు... హర్యాానాలోని కురుక్షేత్ర నుంచి తమిళనాడులోని మధురై వరకు పర్యటించా’’ అని యాదవ్ వివరించారు.
ఇగ్నో నుంచి ఐదు పీజీ డిగ్రీలు, అన్నామలై యూనివర్సిటీ నుంచి నాలుగు, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి రెండు, గువహటి యూనివర్సిటీ నుంచి రెండు చొప్పున ఆయన పీజీ డిగ్రీలను సొంతం చేసుకున్నారు. 2010లో జాదవ్ పూర్ యూనివర్సిటీ నుంచి ఎంఏ గోల్డ్ మెడల్ సంపాదించారు. ‘‘మొదట్లో ఉన్నత విద్యార్హత కోసం ఎంఏ డిగ్రీ చేయాలనుకున్నా. ఆ తర్వాత క్రమంగా పరీక్షలంటే అభిరుచి ఏర్పడింది’’ అని అనిల్ యాదవ్ చెప్పారు.