Balakrishna: చంద్రబాబునాయుడి పాత్రలో నటించనున్న రానా!

  • ఎన్టీఆర్ బయోపిక్ ను తలపెట్టిన బాలయ్య
  • చంద్రబాబు పాత్రకు అంగీకరించిన రానా
  • టాలీవుడ్ లో టాక్
  • ఎన్టీఆర్ జయంతి రోజున ప్రకటన!

నందమూరి బాలకృష్ణ తలపెట్టిన దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ లో రానా కీలక పాత్రను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుతం బాలయ్యకు వియ్యంకుడిగా ఉన్న చంద్రబాబునాయుడి పాత్రలో రానా కనిపిస్తాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిత్ర బృందం రానాను సంప్రదించగా, ఆయన అంగీకరించాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

ఈ నెల 28న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రానా నటించే పాత్రపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా సమాచారం. కాగా, 'లీడర్' చిత్రంలో సీఎంగా కనిపించిన రానా, ఈ సినిమాలోనూ సీఎంగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ విషయమై పూర్తి క్లారిటీ రావాలంటే ఎన్టీఆర్ జయంతి వేడుకల వరకూ వేచిచూడాల్సిందే.

Balakrishna
Rana
NTR
Biopic
Chandrababu
  • Loading...

More Telugu News