gvl narsimha rao: అమెరికాలో బీజేపీ తెలుగు ఎంపీకి పరాభవం.. అడ్డుకున్న ప్రవాసాంధ్రులు

  • న్యూజెర్సీలో ప్రవాసాంధ్రులతో సమావేశమైన జీవీఎల్ నర్సింహారావు
  • ఏపీనీ బీజేపీ చిన్నచూపు చూస్తోందంటూ మండిపడ్డ ప్రవాసాంధ్రులు
  • ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు

తెలుగువాడైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుకు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం న్యూజెర్సీలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఆయన ప్రసంగిస్తుండగా... ప్రవాసాంధ్రులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఏపీకి బీజేపీ చేస్తున్నది ఏమీ లేదని... మీరు చెబుతున్నవన్నీ అబద్ధాలే అంటూ మండిపడ్డారు. ఏపీని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోందని నిలదీశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 

gvl narsimha rao
new jersy
nri
Andhra Pradesh
protest
  • Loading...

More Telugu News