Karnataka: బీజేపీ తప్పు మీద తప్పు చేస్తోంది: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • కర్ణాటక పరిణామాలపై స్పందించిన చంద్రబాబు
  • ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేదు
  • కాంగ్రెస్ - జేడీఎస్ రాజ్ భవన్ నుంచి కదలకుండా ఉండాల్సింది

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీరు సరికాదని తప్పుబట్టిన ఆయన, ఆ పార్టీ పదే పదే తప్పులు చేస్తోందని, ఏ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా బీజేపీ నేతలు వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. తన మంత్రివర్గ సహచరులతో కలసి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన చంద్రబాబు, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోరుబాటను ఎంచుకోలేదని, రాజ్ భవన్ ముందు బైఠాయించి, అక్కడే స్నానపానాదులు కానిస్తూ దేశమంతా చర్చ జరిగేలా జాతీయ మీడియాను ఆకర్షించివుంటే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గవర్నర్ సైతం కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచివుంటే బాగుండేదని అన్నారు. కర్ణాటక ఫలితాలను సమీక్షిస్తే, తెలుగువారి ఓట్లు బీజేపీకి రాలేదని తెలిసిపోతుందని ఆయన అన్నారు.

Karnataka
Andhra Pradesh
Chandrababu
BJP
Congress
JDS
  • Loading...

More Telugu News