Karnataka: ఇక్కడ జరుగుతోంది గుర్రాల బేరం: కన్నడ నటి రమ్య

  • సంతలో గుర్రాలను కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు
  • ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించిన రమ్య
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లొంగబోరన్న గులాం నబీ ఆజాద్

కర్ణాటకలో గుర్రాల బేరాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ మహిళా నేత, నటి రమ్య వ్యాఖ్యానించారు. గుర్రాల సంతలో బేరాలలా కర్ణాటకలోనూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో బీజేపీ బిజీగా ఉందని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించారు. గతంలో పీయుష్ గోయల్ మధ్యవర్తిగా గుజరాత్ ఎన్నికల్లో అనేకమంది ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.

ఇదిలావుండగా, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికీ లొంగబోరని కాంగ్రెస్ నేత, కర్ణాటక వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రలోభాలకు తెరలేపిన మాట వాస్తవమేనని, అయితే, తమ ఎమ్మెల్యేలు వాటికి లొంగరన్న విశ్వాసం తమకుందని అన్నారు.

Karnataka
MLAs
Ramya
Horse Trading
  • Loading...

More Telugu News