Karnataka: సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాదే... మాకు అవకాశం ఇవ్వండి: ఆర్జేడీ నుంచి అనూహ్య డిమాండ్!

  • కర్ణాటకలో బీజేపీకి అవకాశం ఇచ్చిన గవర్నర్
  • బీహార్ లో అతిపెద్ద పార్టీ ఆర్జేడీ
  • తమనూ పిలవాలని తేజస్వీ యాదవ్ డిమాండ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని చెబుతూ, ఆ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వడం, ఇప్పుడు బీజేపీకి కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. గతంలో పలు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీని పక్కనబెట్టి, మెజారిటీ సీట్లు సంపాదించిన కూటములను గవర్నర్లు ప్రభుత్వాల ఏర్పాటుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గోవా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లో ఇలాగే జరిగింది.

ఇక కర్ణాటక తాజా పరిస్థితులపై బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ స్పందిస్తూ, తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచినందున, తక్షణమే బీహార్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు పెద్ద పార్టీనే అవసరమైతే, రాష్ట్రంలో తమదే అతిపెద్ద పార్టీ అని ఆయన గుర్తు చేశారు.

Karnataka
Bihar
RJD
BJP
Single Largest Party
  • Loading...

More Telugu News