director: ప్రముఖ సినీ దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు మృతి

  • సుజాత, స్వర్గం వంటి విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు
  • రామాంతపూర్‌లో తన నివాసంలో కన్నుమూత
  • దర్శకుల సంఘం సంతాపం

సుజాత, స్వర్గం, బొట్టు కాటుక వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలను రూపొందించిన అలనాటి దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు (87) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌, రామాంతపూర్‌లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రముఖ కేరెక్టర్ నటుడు సీఎస్సార్ కు స్వయానా మేనల్లుడైన దుర్గా నాగేశ్వరరావు దర్శకుడిగా తన ప్రస్థానాన్ని 1979లో విజయ బాపినీడు నిర్మించిన 'విజయ' చిత్రం ద్వారా ప్రారంభించారు. అనంతరం పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు దర్శకుడు దాసరి నారాయణరావు వద్ద ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. దుర్గా నాగేశ్వరరావు మృతి పట్ల దర్శకుల సంఘం సంతాపం తెలిపి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.     

director
passed away
Hyderabad
  • Loading...

More Telugu News