central university: అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్శిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • జంతలూరులో యూనివర్శిటీని నెలకొల్పేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • భవనాల నిర్మాణం పూర్తయ్యేంత వరకు.. తాత్కాలిక భవనాల్లో యూనివర్శిటీ
  • నిధుల విడుదలను పర్యవేక్షించనున్న కేంద్ర మానవ వనరుల శాఖ

ఏపీలో సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం జిల్లా జంతలూరులో యూనివర్శిటీని నెలకొల్పేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో పలు కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయం ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. యూనివర్శిటీకి సంబంధించి పూర్తి స్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో యూనివర్శిటీని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. నిధులు విడుదల చేసే ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. ఈ వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరించారు.

central university
anantapur
janthaluru
  • Loading...

More Telugu News