jagan: దెందులూరు నియోజకవర్గంలో ఆటో నడిపిన జగన్

  • ఆటో ఉన్న వాళ్లకు ఏడాదికి రూ. 10వేలు ఇస్తానంటూ జగన్ హామీ
  • ఆటో డ్రైవర్లకు అండగా ఉంటానంటూ భరోసా
  • సంతోషం వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు

వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఆటోవాలాగా మారారు. దెందులూరు నియోజకవర్గం మేదినరావుపాలెం వద్ద ఆయన ఖాకీ చొక్కా వేసుకుని, ఆటోను నడిపారు. వివరాల్లోకి వెళ్తే, ఏలూరు సభలో జగన్ మాట్లాడుతూ... సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ. 10వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆటోవాళ్లకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో, వేదినరావుపాలెం వద్ద పాదయాత్ర చేస్తున్న జగన్ ను ఆటో డ్రైవర్లు కలిశారు. జగన్ ఇచ్చిన హామీపై ఆనందం వ్యక్తం చేశారు. జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ను తమ ఆటో ఎక్కించారు.

jagan
auto
drivers
ysrcp
  • Loading...

More Telugu News