jds: తమపై వస్తున్న వార్తలపై జేడీఎస్ మిస్సింగ్ ఎమ్మెల్యేల స్పందన

  • మేము ఎక్కడికీ పోలేదు
  • 450 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసరికి.. లేట్ అయింది
  • ఎప్పటికీ కుమారస్వామితోనే ఉంటాం

జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారనే వార్తలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం జరిగిన సమావేశానికి 38 మంది ఎమ్మెల్యేలలో 36 మంది మాత్రమే హాజరయ్యారు. రాజా వెంకటప్ప, నాదగౌడలు హాజరుకాలేదు. దీంతో, జేడీఎస్ నేతలు ఆందోళనకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో, వారిద్దరూ స్పందించారు. తాము ఎక్కడికీ పోలేదని చెప్పారు. కుమారస్వామితోనే తాము ఉంటామని తెలిపారు. బెంగళూరుకు తాము 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, అందుకే సమయానికి సమావేశానికి హాజరు కాలేకపోయామని చెప్పారు. దీనికి తోడు, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కూడా అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము బీజేపీకి దగ్గర కాబోమని... ఎప్పటికీ జేడీఎస్ లోనే ఉంటామని చెప్పారు.

jds
mla
missing
bjp
karnataka
  • Loading...

More Telugu News