Karnataka: పెరిగిపోతున్న జంప్ జిలానీలు... రసవత్తరంగా కన్నడ రాజకీయాలు!

  • తనను మంత్రిని చేస్తానని బీజేపీ ఆశచూపిందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లింగనగౌడ పాటిల్
  • బీజేపీ నుంచి ఆరుగురు తమతో టచ్ లో ఉన్నారన్న కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు గంటగంటకూ ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారిపోతున్నాయి. ఒక పార్టీని మించి మరొక పార్టీ ప్రలోభాల క్రీడలను ఆడుతున్నాయి. ఇందుకు పలు నేతల ప్రకటనలే నిదర్శనం. బీజేపీ నుంచి పెద్ద ఆఫర్లు తనకు వస్తున్నట్టు కాంగ్రెస్ నాయకుడు అమరగౌడ లింగనగౌడ పాటిల్ ఈ రోజు మీడియాకు తెలిపారు.

‘‘బీజేపీ నేతలు నాకు కాల్ చేశారు. మాతో వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. కానీ, నేను కాంగ్రెస్ తోనే ఉంటాను. హెచ్ డీ కుమారస్వామే మా ముఖ్యమంత్రి’’ అని లింగనగౌడ పాటిల్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ మరో బాంబు పేల్చారు. ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. తామంతా కలిసే ఉన్నామని స్పష్టం చేశారు.


Karnataka
ELECTIONS
  • Loading...

More Telugu News