Pawan Kalyan: సహాయక చర్యల్లో పాల్గొనండి: కార్యకర్తలకు పవన్ కల్యాణ్ ఆదేశం

  • లాంచీ ప్రమాదంలో 45 మంది గల్లంతు
  • ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కార్యకర్తలకు సూచన

తూర్పుగోదావరి జిల్లాలో నిన్న సాయంత్రం గోదావరి నదిలో జరిగిన ఘోర లాంచీ ప్రమాదంలో 45 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేవీపట్నం మండలం ముంటూరు వద్ద జరిగింది. 12 మంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదం గురించిన వార్తను వినగానే ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతవడం కలచివేసిందని అన్నారు. జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. మరోవైపు, గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.

Pawan Kalyan
boat
accident
Jana Sena
  • Loading...

More Telugu News