Hyderabad: హైదరాబాద్ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-5569e5ee67fa4254346ea1147e2476ddc66f77b4.jpg)
- కొంత మేరకు చల్లబడ్డ వాతావరణం
- నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైమాటే
- నిన్న నగరంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత 36.8 డిగ్రీలు
హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో కొంత మేరకు వాతావరణం చల్లబడింది. నిన్న నగరంలో 36.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 22.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నాలుగు రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కానీ, నిన్న మాత్రం గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని అన్నారు. సాయంత్రం సమయాల్లో మబ్బులు పట్టి, వర్షపు జల్లులు పడే అవకాశముందని బేగంపేట వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు.