Uttar Pradesh: యూపీలో కుప్పకూలిన ఫ్లై ఓవర్‌.. 12 మంది మృతి

  • ఉత్తరప్రదేశ్‌, వారణాసి కంటోన్మెంట్‌ ప్రాంతంలో ప్రమాదం
  • నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలి 12 మందికి పైగా మృతి
  • శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం

ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలి 12 మంది మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అక్కడి అధికారులు చెప్పారు. శిథిలాల కింద నాలుగు కార్లు, ఓ స్కూటర్‌, మిని బస్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, గాయాలపాలయివారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ ఘటనపై తాను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడానని, ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టిందని తెలిపారు.         

  • Error fetching data: Network response was not ok

More Telugu News