Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు!

  • ముగిసిన ఓట్ల లెక్కింపు 
  • బీజేపీ -104, కాంగ్రెస్ - 78, జేడీఎస్ - 38 స్థానాల్లో విజయం 
  • ఇతరులు - 2 స్థానాల్లో గెలుపు
  • మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయిన బీజేపీ!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా 222 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరిగింది. తుది ఫలితాల వివరాలు.. బీజేపీ-104, కాంగ్రెస్-78, జేడీఎస్-38, ఇతరులు-2 స్థానాల్లో విజయం సాధించారు.

కాగా, ఈ నెల 12 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఇవి రికార్డులకెక్కాయి. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందనే విషయమై సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. కర్ణాటకలో మళ్లీ అధికారం చేజిక్కుంచుకునే దిశగా ‘కాంగ్రెస్’ పెద్దలు పావులు కదుపుతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయపార్టీగా అవతరించిన తమకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ నేతలు కర్ణాటక గవర్నర్ ను కలిశారు.

  • Loading...

More Telugu News