yeddyurappa: రేవణ్ణ అండగా ఉన్నారు.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించండి: గవర్నర్ తో యడ్యూరప్ప

  • గవర్నర్ ను కలిసిన యడ్యూరప్ప
  • ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ విన్నపం
  • తగినంత బలం ఉందని చెప్పిన యెడ్డీ

కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కలిశారు. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా యెడ్డీ కోరారు. జేడీఎస్ నేత రేవణ్ణ (దేవెగౌడ పెద్ద కుమారుడు) 12 మంది ఎమ్మెల్యేలతో తమకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం తమకు ఉందని చెప్పారు. బలనిరూపణకు వారం రోజుల గడువు ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. ఈ సందర్భంగా యడ్యూరప్పతో పాటు కేంద్ర మంత్రి అనంతకుమార్ కూడా గవర్నర్ ను కలిశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News