siddaramaiah: రాజీనామా లేఖ సమర్పించిన సిద్ధరామయ్య

  • గవర్నర్‌తో కాసేపు చర్చించిన సిద్ధరామయ్య
  • జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతు
  • కాసేపట్లో గవర్నర్‌ వద్దకు జేడీఎస్‌ నేతలు

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీఎస్‌కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తమ రాష్ట్ర గవర్నర్‌ నివాసానికి వెళ్లి కాసేపు చర్చించారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. కర్ణాటకలో తమ మద్దతుతో జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని, అందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను సిద్ధరామయ్య కోరినట్లు సమాచారం. అయితే, గవర్నర్‌ నిర్ణయం ఎలా ఉంటుందన్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో కాంగ్రెస్‌ నేతలతో కలిసి జేడీఎస్‌ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు.

siddaramaiah
Karnataka
Congress
  • Loading...

More Telugu News