JDS: బయట నుంచి మద్దతు ఇస్తామన్న కాంగ్రెస్.. ప్రభుత్వంలో చేరాలన్న దేవెగౌడ!
- జేడీఎస్ కు సీఎం, కాంగ్రెస్ కు డిప్యూటీ సీఎం
- జేడీఎస్ కు 14, కాంగ్రెస్ కు 20 మంత్రి పదవులు
- కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చలు ఫలప్రదమైనట్టే కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య జరిగిన చర్చల్లో సీఎం పదవిని జేడీఎస్ కు, డిప్యూటీ సీఎం పదవిని కాంగ్రెస్ కు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు చెబుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ కు 20, జేడీఎస్ కు 14 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదనను దేవెగౌడ నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటేనే బాగుంటుందని ఆయన స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.