karnataka: డోంట్ వర్రీ.. నా వెనుక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు!: బీజేపీకి దేవెగౌడ పెద్ద కొడుకు అభయాస్తం?

  • క్షణ క్షణానికి మారుతున్న కర్ణాటక రాజకీయాలు
  • కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిగ్నల్
  • బీజేపీకి మద్దతు ఇస్తానని దేవెగౌడ పెద్ద కుమారుడు చెప్పినట్టు సమాచారం

కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. క్షణానికో కొత్త వార్త వచ్చి జనాలను ఉత్కంఠకు గురి చేస్తోంది. హంగ్ ఏర్పడబోతున్న నేపథ్యంలో జేడీఎస్ కింగ్ మేకర్ గా మారింది. ఈ నేపథ్యంలో, కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు జేడీఎస్ తో చర్చలు జరపాలంటూ రాష్ట్ర నేతలను బీజేపీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.

బీజేపీకి దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. తన వెనుక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమంటూ, తాజాగా హోలెనరసిపూర్ స్థానం నుంచి గెలుపొందిన రేవన్న ఇప్పటికే బీజేపీకి భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఇదే నిజమైతే... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే చెప్పొచ్చు.

karnataka
elections
bjp
congress
jds
kumaraswamyh
deve gowda
revanna
  • Loading...

More Telugu News