Karnataka: బీజేపీ దూసుకుపోవడాన్ని ఈవీఎంల విజయంగా అభివర్ణించిన రాజ్ థాక్రే!

  • కర్ణాటకలో ఈవీఎంల పనితీరుపై రాజ్ థాక్రే అనుమానం
  • ఇప్పటి వరకు 94 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ
  • 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ‘కమలం’

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు బీజేపీ 94 స్థానాల్లో విజయం సాధించగా, 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో, బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయిన సమయంలో శివసేన పార్టీ అధినేత రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఈవీఎంల పనితీరుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ ఫలితాలను ఈవీఎంల విజయంగా ఆయన అభివర్ణించారు. రాజ్ థాకరే చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. కాగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వెళుతున్నాయి. 

Karnataka
bjp
rajthackrey
  • Loading...

More Telugu News