siddaramaiah: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై.. కీలక ప్రకటనలు చేసిన గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య
- ఇప్పటివరకు 65 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్
- 93 స్థానాల్లో గెలిచిన బీజేపీ
- జేడీఎస్‌కి మద్దతిస్తున్నామంటూ కాంగ్రెస్ కీలక ప్రకటన
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 65 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఇప్పటివరకు 93 స్థానాల్లో గెలిచి 11 స్థానాల్లో లీడ్‌లో ఉంది. అయితే, కర్ణాటకలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ప్రణాళిక వేసుకుంటోన్న బీజేపీ ఆశలపై కాంగ్రెస్ నీల్లు చల్లింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తాము రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. 'ప్రజల తీర్పే శిరోధార్యం.. జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది' అని వ్యాఖ్యానించారు.
జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఇతర కాంగ్రెస్ నేతలు కీలక ప్రకటన చేశారు. తాము జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామితో చర్చలు జరిపామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని గవర్నర్ ను కోరతామని అన్నారు. జేడీఎస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా తమ మద్దతు ఉంటుందని తెలిపారు.