sai kumar: చిత్తుచిత్తుగా ఓడిపోయిన నటుడు సాయికుమార్... డిపాజిట్ గల్లంతు!

  • నాలుగో స్థానంలో నిలిచిన సాయికుమార్
  • సిట్టింగ్ ఎమ్యెల్యే చేతిలో ఓటమి
  • 2008లో సైతం ఓడిపోయిన డైలాగ్ కింగ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఏపీ సరిహద్దులో ఉన్న బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఆయనను ఓటర్లు తిరస్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి చేతిలో ఆయన చిత్తుగా ఓడిపోయారు. నాలుగో స్థానంలో ఆయన నిలిచారు. రెండు, మూడు స్థానాల్లో సీపీఎం, జేడీఎస్ లు నిలిచాయి. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే, సాయికుమార్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 2008 ఎన్నికల్లో సైతం ఇదే స్థానం నుంచి సాయికుమార్ ఓటమిపాలయ్యారు. 

sai kumar
saikumar
karnataka
elections
bagepalli
lost
  • Loading...

More Telugu News