ntr: ఎన్టీఆర్ మూవీకి 'అ' సెంటిమెంట్ వద్దంటోన్న అభిమానులు

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • ఆయన జోడీగా పూజా హెగ్డే 
  • ఈ నెల 20వ తేదీన టైటిల్ ప్రకటన  

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా షూటింగ్ మొదలైంది. ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాకి 'అసామాన్యుడు' అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.అయితే ఎన్టీఆర్ ఇమేజ్ కి తగినట్టుగా ఈ టైటిల్ లేదనీ .. ఈ టైటిల్ ను మాత్రం సెట్ చేయవద్దని త్రివిక్రమ్ కి రిక్వెస్ట్ లు వస్తున్నాయట. 'అ ఆ' సినిమా హిట్ అయినా 'అజ్ఞాతవాసి' పరాజయంపాలు కావడం వలన, 'అ' సెంటిమెంట్ ను పక్కన పెట్టేయడమే మంచిదని త్రివిక్రమ్ తో సన్నిహితులు కూడా చెబుతున్నారట. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని అంటున్నారు. మరి ఇదే టైటిల్ ను ప్రకటిస్తాడా? లేక కొత్త టైటిల్ ను సెట్  చేస్తాడా? అనేది చూడాలి.      

  • Loading...

More Telugu News