siddaramaiah: చాముండేశ్వరిలో సిద్ధరామయ్యకు షాక్.. జేడీఎస్ గెలుపు!

  • సిద్ధరామయ్యపై జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవేగౌడ గెలుపు
  • 25 వేలకు పైగా ఓట్లతో సిద్ధూ పరాజయం
  • బాదామిలో స్వల్ప ఆధిక్యంలో ఉన్న ముఖ్యమంత్రి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆయనకు పరాభవం ఎదురైంది. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ 25,861 ఓట్లతో సిద్ధరామయ్యపై గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి కూడా సిద్దూపై జీటీ దేవెగౌడ ఆధిపత్యం కనపరచడం గమనార్హం.

సిద్ధరామయ్య పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం బాదామిలో మాత్రం ఆయన లీడింగ్ లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి, గాలి జనార్దనరెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములుపై ఆయన స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. తొలుత శ్రీరాములు ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ... ఆ తర్వాత సిద్ధరామయ్య ఆధిక్యంలోకి వచ్చారు.

siddaramaiah
karnataka
elections
chamundeswari
lost
loose
  • Loading...

More Telugu News