Chandrababu: చంద్రబాబును ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ట్వీట్!

  • తెలుగు ప్రజలు బీజేపీకి ఓటు వేయకుండా అన్ని ప్రయత్నాలు చేశారు
  • చంద్రబాబు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు
  • హైదరాబాద్ కర్ణాటకలో మా స్థానాలు పెరిగాయి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ తో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. "కర్ణాటకలోని తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటు వేయకుండా చేసేందుకు చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అన్ని రకాల వ్యూహాలను పన్నారు. కానీ, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ ఘన విజయం సాధించింది. మా స్థానాలను 6 నుంచి 20కి పెంచుకున్నాం. చంద్రబాబు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. దక్షిణాదిపై ఆధిపత్యం సాధించే దిశగా మా ప్రయాణం మొదలైంది" అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Chandrababu
ram madhav
karnataka
elections
tweet
south india
  • Error fetching data: Network response was not ok

More Telugu News