nikhil: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో నిఖిల్

  • ఎన్నో వ్యతిరేకతలు ఉన్నా బీజేపీనే గెలుస్తోంది
  • మోదీ మెజీషియన్ లా కనిపిస్తున్నారు
  • అమిత్ షా, బీజేపీలకు శుభాకాంక్షలు

కర్ణాటకలో బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టాలీవుడ్ హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "నోట్ల రద్దు, జీఎస్టీ, విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు, ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, కర్ణాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉండటం లాంటి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ... మరోసారి బీజేపీనే గెలుస్తోంది. ప్రధాని మోదీ మెజీషియన్ లా కనిపిస్తున్నారు. కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా. అమిత్, షా, బీజేపీలకు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా మోదీ పగలబడి నవ్వుతున్న ఓ వీడియోను అప్ లోడ్ చేశాడు.

nikhil
hero
tollywood
karnataka
elections
Narendra Modi
amit shah
BJP
  • Error fetching data: Network response was not ok

More Telugu News