keerti suresh: 'మహానటి' సక్సెస్ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్

- ఘన విజయం సాధించిన 'మహానటి'
- ఒక్కసారిగా పెరిగిన కీర్తి సురేశ్ క్రేజ్
- తిరుమల శ్రీవారికి మొక్కులు
సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సావిత్రిగా కనిపించడంలోను .. సావిత్రిలా నటించడంలోను కీర్తి సురేశ్ మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటివరకూ కథానాయకుల సరసన ఆడుతూ పాడుతూ అలరిస్తూ వచ్చిన కీర్తి సురేశ్, కథా భారాన్ని పూర్తిగా తనపై వేసుకుని నడిపించిన సినిమా ఇది. ఆమెలోని నటిని పూర్తిస్థాయిలో వెలికి తీసిన సినిమా ఇది.
