Prabhas: భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో 'సాహో'!

  • 'అబుదాబి'లో 'సాహో' షూటింగ్
  • ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే 
  • కీలకమైన పాత్రలో అరుణ్ విజయ్

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ 'అబుదాబి'లో జరుగుతోంది. ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ .. నీల్ నితిన్ ముఖేశ్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. వీటి కోసం చాలా ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ యాక్షన్ ఎపిసోడ్ లోకి అరుణ్ విజయ్ జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ ఒక్క యాక్షన్ సీన్ కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ బాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత 'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో కలిసి ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆయన జోడీగా ఆల్రెడీ పూజా హెగ్డేను ఎంపిక చేశారు . 

  • Loading...

More Telugu News