Kotayaan: బోణీ కొట్టిన బీజేపీ... తొలి విజయం నమోదు చేసిన ఉమానాథ్!

  • ఫలితాల వెల్లడి షురూ
  • కోటాయాన్ లో గెలిచిన ఉమానాథ్
  • బళ్లారి జిల్లాలో 'గాలి' హవా

కన్నడనాట ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకూ ట్రెండ్స్ మాత్రమే వస్తుండగా, తొలి విజయాన్ని బీజేపీ నమోదు చేస్తూ బోణీ కొట్టింది. కోటాయాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఉమానాథ్ విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇక బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 9 నియోజకవర్గాలున్న జిల్లాలో ఆరు చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బెంగళూరు నగరంలో కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ తన పట్టును నిలుపుకోగా, ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.

Kotayaan
BJP
Umanath
Victory
Congress
Karnataka
Elections
  • Loading...

More Telugu News