Karnataka: పడిపోతున్న కాంగ్రెస్... 105 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం!

  • 105కు పెరిగిన బీజేపీ మెజారిటీ స్థానాలు
  • 65కు తగ్గిన కాంగ్రెస్
  • 214 స్థానాల్లో వెలువడుతున్న ట్రెండ్స్

కర్ణాటకలో బీజేపీ సెంచరీ కొట్టింది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం 105కు పెరుగగా, కాంగ్రెస్ మెజారిటీలో ఉన్న స్థానాల సంఖ్య 65కు పడిపోయింది. ఇదే సమయంలో జేడీఎస్ మెజారిటీ స్థానాలు 42కు పెరిగాయి. తొలి నుంచి నువ్వానేనా అన్న రీతిలో సాగిన ఫలితాల సరళి, రెండు గంటల వ్యవధిలో బీజేపీకి అనుకూలంగా మారినట్టు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం 214 స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ట్రెండ్స్ వెలువడ్డాయి. బీజేపీ బెంగళూరు కార్యాలయం వద్ద అభిమానులు, కార్యకర్తల సందడి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న అభిమానులు, ఇంకాస్త స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఎవరి మద్దతు లేకుండా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీని సాధించి తీరుతామని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Karnataka
Congress
JDS
Elections
BJP
Trends
  • Loading...

More Telugu News