Karnataka: బాగేపల్లిలో ఓటమి దిశగా నటుడు సాయికుమార్!

  • వేగంగా సాగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • బాదామిలో శ్రీరాములు, చిత్తాపూర్ లో ప్రియాంక్ ఖర్గే వెనుకంజ
  • గెలుపు దిశగా జగదీష్ షెట్టర్, రహీమ్ ఖాన్ ముందంజ

ప్రముఖ నటుడు, కన్నడనాట బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ పడిన సాయికుమార్ ఓటమి దిశగా సాగుతున్నారని తెలుస్తోంది. బాదామిలో బీజేపీ అభ్యర్థి బీ శ్రీరాములు, చిత్తాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక్ ఖర్గే, బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ హెచ్ లాడ్, సోరబ్ లో బీజేపీ అభ్యర్థి కుమార బంగారప్ప తదితరులు వెనుకంజలో ఉన్నారు.

ఇదే సమయంలో హరప్పనహళ్లిలో బీజేపీ అభ్యర్థి జీ కరుణాకర్ రెడ్డి, షిమోగాలో బీజేపీ అభ్యర్థి కేఎస్ ఈశ్వరప్ప, మొలకలమూరులో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు, హలియాల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్వీ దేశ్ పాండే, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ లో బీజేపీ అభ్యర్థి జగదీష్ షెట్టర్, బీదర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రహీమ్ ఖాన్ తదితరులు ముందంజలో ఉన్నారు. కాగా, మొత్తం 218 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడుతుండగా, బీజేపీ 96, కాంగ్రెస్ 80, జేడీఎస్ 42, ఇతరులు ఒక్క చోట ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.

Karnataka
BJP
Congress
Elections
JDS
  • Loading...

More Telugu News