Karnataka: కన్నడనాట 160 స్థానాల్లో తొలి ట్రెండ్స్ వెల్లడి... ఆధిక్యంలోకి వచ్చేసిన సిద్ధరామయ్య!

  • 66 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
  • 71 చోట్ల బీజేపీ ముందంజ
  • బాదామిలో 384 ఓట్ల ఆధిక్యంలో సిద్ధరామయ్య

కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులను తెరిచి తొలి రౌండ్ ఓట్లను అధికారులు లెక్కిస్తుండగా, 160 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 66 చోట్ల ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 71 చోట్ల ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో జేడీఎస్ 23 స్థానాల్లో తన ఆధిక్యాన్ని చూపిస్తోంది.

 బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బీజేపీ తరఫున పోటీ చేసిన గాలి సోమశేఖర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రామనగర్ లో జేడీఎస్ నేత కుమారస్వామి 2 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. బాదామిలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత శ్రీరాములు కన్నా సీఎం సిద్ధరామయ్య 384 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తరువాత సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఆయన ఆధిక్యంలోకి వచ్చారు.

  • Loading...

More Telugu News