Facebook: 200 యాప్స్ ను డిలీట్ చేసిన ఫేస్ బుక్!
- ఖాతాదారుల సమాచారం చోరీ కావడంతో విమర్శల పాలు
- మార్చి నుంచి విచారణ చేపట్టిన ఫేస్ బుక్
- యాప్ తొలగించినట్టు వెల్లడించిన ఇమి అర్జిబాంగ్
ఖాతాదారుల సమాచారం చోరీ కావడంతో విమర్శల పాలైన ఫేస్ బుక్, సమాచారాన్ని దొంగిలించడం, దుర్వినియోగం చేయడం వంటి పనులు చేస్తున్న 200 థర్డ్ పార్టీ యాప్స్ పై వేటు వేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ప్రొడక్ట్స్ పార్టనర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ ఇమి అర్జిబాంగ్ వెల్లడించారు. తాము వేల కొద్దీ యాప్స్ ను పరిశీలిస్తున్నామని, వాటిల్లో చాలావాటిని తొలగించనున్నామని ఆయన పేర్కొన్నారు.
కాగా, గత మార్చిలోనే జుకర్ బర్గ్, తమ ప్లాట్ ఫామ్ పై ఉన్న యాప్స్ పై విచారణ జరిపించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్గత టీమ్ తో పాటు బయటి నుంచి వచ్చిన నిపుణులతో కూడిన టీమ్ లు ఈ పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని తస్కరించిందని వార్తలు వెలువడిన తరువాత సంస్థ మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే.