Jagan: అదే తేదీన రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేశా!: వైఎస్ జగన్

  • ప్రజా సంకల్పయాత్రలో 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న జగన్
  • ఏలూరు మండలం వెంకటాపురంలో పైలాన్ ఆవిష్కరణ
  • 2004, మే 14న ఏపీ సీఎంగా వైఎస్ ప్రమాణ స్వీకారం చేశారు
  • అదే తేదీన రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేశా!

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకటాపురంలో పైలాన్ ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ ని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అభినందించారు. 

కాగా, రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తీసుకొస్తానని, అందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే తన సంకల్పమని జగన్ ఓ ట్వీట్ చేశారు.. 2004, మే 14న ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారని, అదే తేదీన రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేశానని అన్నారు. వైఎస్ ముందుచూపు, ఆయన చేపట్టిన అభివృద్ధి పథకాలు నిరుపమానమని ప్రశంసించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News