Narendra Modi: మోదీ హద్దులు దాటి మాట్లాడుతున్నారు.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది: రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ లేఖ
- కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోదీ భాష బాగోలేదు
- కాంగ్రెస్ నేతలపై పలు వ్యాఖ్యలు చేశారు
- ప్రతిష్టాత్మక హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఎలా?
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలోని హుబ్బెళ్లిలో పర్యటించినప్పుడు కాంగ్రెస్ నేతలపై మండిపడుతూ వాడిన భాష ఏం బాగోలేదని పేర్కొంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ లేఖ రాశారు. ప్రధాని స్థాయిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని, దేశంలో ప్రతిష్టాత్మక హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఎలా? అని అన్నారు.
మోదీని ప్రజలు గమనిస్తుంటారని, భాష మార్చుకోమని మీరైనా చెప్పండని రాష్ట్రపతిని మన్మోహన్ సింగ్ కోరారు. మోదీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆ లేఖపై పలు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా సంతకాలు చేశారు.