BJP: అధిష్ఠానం నిర్ణయంపై ఏపీ బీజేపీ నేతల అసంతృప్తి.. రాజీనామాలు

  • బీజేపీ ఏపీ రాష్ట్రాధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ
  • ఉభయ గోదావరి జిల్లాల బీజేపీ నేతల ఆగ్రహం
  • ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడమేంటని ఫైర్‌

బీజేపీ ఏపీ రాష్ట్రాధ్యక్షుడి పదవికి ఎంపీ హరిబాబు రాజీనామా చేసిన తరువాత ఆ పదవి తనకే దక్కుతుందని సోము వీర్రాజు ఆశించిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ నేతలు, సోము వీర్రాజు అనుచరులు, అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో బీజేపీ అధ్యక్షులుగా ఉన్న నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. బీజేపీలో మొదటి నుంచి ఉంటోన్న వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి రాష్ట్రాధ్యక్షుడి పదవి కట్టబెట్టడం ఏంటని విమర్శలు చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల వైసీపీలో చేరేందుకు ప్రయత్నించగా ఆయనను బుజ్జగించి మరీ బీజేపీలోనే ఉంచి, చివరకు రాష్ట్రాధ్యక్షుడి పదవి ఇచ్చారని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News