akhil: బెస్ట్ యాక్షన్ ఫారిన్ ఫిల్మ్ అవార్డుకి పోటీ పడుతున్న 'హలో'!

  • విక్రమ్ కుమార్ నుంచి వచ్చిన 'హలో'
  • లుక్స్ తో యూత్ ను మెప్పించిన అఖిల్ 
  • టీమ్ కి కృతజ్ఞతలు చెప్పిన విక్రమ్ కుమార్  

విభిన్నమైన కథాకథనాలకు విక్రమ్ కుమార్ కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తారు. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చిన సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. అఖిల్ హీరోగా ఆయన నుంచి క్రితం ఎడాది డిసెంబర్లో 'హలో' సినిమా వచ్చింది. ఈ సినిమా వసూళ్ల పరంగా ఆశించినస్థాయి విజయాన్ని అందుకోకపోయినా, టేకింగ్ పరంగా .. అఖిల్ లుక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

 అలాంటి ఈ సినిమా .. 'వరల్డ్ స్టంట్ అవార్డ్స్' లో 'బెస్ట్ యాక్షన్ ఫారిన్ ఫిల్మ్' కేటగిరిలో నామినేట్ అయింది. అందుకు తనకి చాలా గర్వంగా ఉందంటూ విక్రమ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ఈ కేటగిరిలో నామినేట్ అయినందుకు సహకరించిన వాళ్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అఖిల్ హార్డ్ వర్క్ .. ఆయన అంకితభావం ఈ సినిమాను పైస్థాయికి తీసుకెళ్లాయని అన్నారు.    

akhil
kalyani priyadarshan
  • Error fetching data: Network response was not ok

More Telugu News