ntr: ఎన్టీఆర్ తో షూటింగుకి వచ్చేసిన పూజా హెగ్డే

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ
  • ఆయన జోడీగా పూజా హెగ్డే
  • హైదరాబాద్ లో షూటింగ్      

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇది ఎన్టీఆర్ కి 28వ సినిమా .. ఇందులో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన కొన్ని రోజులుగా గట్టి కసరత్తులు చేస్తూ వస్తున్నాడు. హాలీవుడ్ మేకప్ మేన్ ఎన్టీఆర్ కి మేకప్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగులో పూజా హెగ్డే జాయిన్ అవుతుంది. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. మరోపక్క, త్వరలో పూజా హెగ్డే 'సాక్ష్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ మూవీ తరువాత ఆమె మహేశ్ బాబు .. ప్రభాస్ సినిమాలు చేయనుండటం విశేషం. మొత్తానికి పూజా హెగ్డే పూజలు ఫలించాయనే చెప్పాలి.   

  • Loading...

More Telugu News