keerti suresh: 2 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసిన 'మహానటి'

- తెలుగు రాష్ట్రాల్లో 'మహానటి' జోరు
- ఇతర దేశాల్లోనూ అదే సందడి
- వెల్లువెత్తుతోన్న ప్రశంసలు
సావిత్రిని అభిమానించే ప్రేక్షకులంతా ఆమె బయోపిక్ గా వచ్చిన 'మహానటి' సినిమాకి నీరాజనాలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ఇతర దేశాల్లోనూ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సావిత్రి జీవితాన్ని నిజాయతీగా తెరకెక్కించిన కారణంగా ఈ సినిమాకి నూటికి నూరు మార్కులు వేసేస్తున్నారు.
