yenumula muralidhar reddy: జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న గుంటూరు జిల్లా నేత యెనుముల

  • 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన యెనుముల
  • ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరిన గురజాల నేత
  • వైసీపీ గెలుపే తన లక్ష్యమన్న యెనుముల

గుంటూరు జిల్లా గురజాల మండలానికి చెందిన యెనుముల మురళీధర్ రెడ్డి వైసీపీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ను కలసి... ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర నేత జంగా కృష్ణమూర్తి, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిలు ఉన్నారు. 2014 ఎన్నికల ముందు యెనుముల టీడీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యెనుముల మాట్లాడుతూ, పార్టీ అభ్యున్నతి కోసం పని చేస్తానని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపే తన లక్ష్యమని చెప్పారు.

yenumula muralidhar reddy
gurajala
YSRCP
jagan
Telugudesam
pinnelli
  • Loading...

More Telugu News